జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు

ప్ర‌క‌టించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి

తిరుమల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. 2026 జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి. జనవరి 4వ తేదీన తిరుమల శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం జ‌రుగుతుంది. 8న శ్రీవారి సన్నిధిన పెద్ద శాత్తుమొర నిర్వ‌హిస్తారు. 12న శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు సమాప్తి అవుతాయి. 13న తిరుమల శ్రీవారు తిరుమల నంబి సన్నిధికి వేంచేపు. 14న భోగి పండుగ ఉంటుంది.15న మకర సంక్రాంతి, సుప్రభాతసేవ పునఃప్రారంభం.

16న కనుమ పండుగ, తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేపు. 18న పురందరదాసుల ఆరాధన మహోత్సవం. 23న వసంత పంచమి. జనవరి 25న రథ సప్తమి జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది టీటీడీ. ఇదిలా ఉండ‌గా వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం సంద‌ర్బంగా భారీ ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేప‌ట్టింది టీటీడీ. ఇదిలా ఉండ‌గా మొత్తం వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌కు సంబంధించి మొత్తం 10 రోజుల పాటు ఉంటుంద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *