త‌న కుమారుడి పేరుతో ఘాట్ వ‌ద్దు

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన నారా లోకేష్

విజ‌య‌వాడ : ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ త‌న‌యుడు నారా దేవాన్ష్ పేరుతో గోదావ‌రి పుష్క‌రాల‌ను పుర‌స్క‌రించుకుని ఓ ఘాట్ కు త‌న పేరు పెట్టాల‌ని నిర్ణ‌యించ‌డంపై. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిర‌స‌న‌కు, చ‌ర్చ‌కు దారి తీసింది. దీంతో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీయ‌డంతో స్పందించారు నారా లోకేష్‌. ఏపీలో ‘దేవాన్ష్ ఘాట్’ వివాదం చెల‌రేగ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న‌ట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఒక పుష్కర ఘాట్‌కు నారా దేవాన్ష్ పేరు పెట్టడంపై ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వివాదం చెలరేగింది. ఈ చర్యను నారా లోకేష్ వ్యతిరేకిస్తూ ఇది “హాస్యాస్పదం” అని పేర్కొన్నారు.

రాజానగరం నియోజకవర్గంలోని ముని కూడలి వద్ద ఉన్న ఈ ఘాట్‌కు ఇప్పటికే “దేవాన్ష్ ఘాట్” అని పేరు పెట్టారని స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. దీనిని రూ1 కోటి నిధులతో ఆదర్శవంతమైన ఘాట్‌గా అభివృద్ధి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారని ఆయన చెప్పారు. ఈ పరిణామంపై స్పందించిన లోకేష్, తన కుమారుడి పేరుతో ఏ ఘాట్‌కూ పేరు పెట్టకూడదని తాను స్పష్టమైన ఆదేశాలు జారీ చేశానని తెలిపారు. ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆ పేరు పెట్టే వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *