సీఎం అయినా మార‌ని విజ‌య్ వ్య‌క్తిత్వం

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన న‌టుడు విశాల్

చెన్నై : అగ్ర న‌టుడు, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా కొలువు తీరిన జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ పై ప్ర‌శంస‌లు కురిపించారు స్టార్ హీరో విశాల్. మ‌గ‌డం సినిమా పాట‌ల విడుద‌ల సంద‌ర్బంగా జ‌రిగిన కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు విశాల్. సీఎం వ్య‌క్తిత్వం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. విజ‌య్ త‌న‌కు 30 ఏళ్లుగా తెలుస‌ని చెప్పారు. ఆయన కాలేజీలో మా అన్నయ్యతో కలిసి చదువుకున్నారు, అప్పటి నుంచే నేను ఆయనను కలుస్తూ వస్తున్నాను. త‌ను ముఖ్యమంత్రి అయ్యాక కూడా, నేను ఆయనను కలిసినప్పుడు ఆయనలో ఎలాంటి మార్పూ కనిపించ లేద‌న్నాడు.

విజ‌య్ లో అదే వ్యక్తిత్వం, అదే హావభావాలు, అదే మంచి గుణాలు; కేవలం పదవి మాత్రమే మారింద‌న్నారు విశాల్ . విజయ్‌తో మాట్లాడేటప్పుడు నేను ‘సారీ, డార్లింగ్’ (Sorry, darling) అని అన్నాను—ఒక ముఖ్యమంత్రిని ‘డార్లింగ్’ అని పిలవడం ఎంత అద్భుతమో ఆలోచించండి; అది ఒక స్నేహితుడితో మాట్లాడినట్లు అనిపించింది, ఆ వాతావరణం చాలా బాగుంది. ఆయనకు పూలగుచ్ఛం (bouquet) ఇచ్చే బదులు, ‘మీ పేరు మీద ముగ్గురు పిల్లల చదువు బాధ్యతను నేను తీసుకుంటాను’ అని చెప్పాను. ఆయన ఎంతో సంతోషించి దానికి అంగీకరించారు. ముఖ్యమంత్రికి పూలగుచ్ఛం ఇవ్వక పోవడం ద్వారా నేను సంప్రదాయాన్ని పక్కన పెట్టానన్నది నిజమే, కానీ ఆయన దానిని మనస్ఫూర్తిగా అంగీకరించారు. అది నా గొప్పతనం కాదు, దానిని అంగీకరించిన ఆయన గొప్పతనం అని పేర్కొన్నారు విశాల్.

  • Related Posts

    పాన్ మ‌సాలా ప్ర‌చారంపై బాలీవుడ్ న‌టుల‌కు నోటీసులు

    ముంబై : విమల్ యాలాకుల‌ ప్రకటనకు సంబంధించి నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్ , టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఎఫ్‌డిఎ షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ప్రకటన ప్రాథమికంగా నిషేధిత పాన్ మసాలా , పొగాకు సంబంధిత ఉత్పత్తుల…

    జై శ్రీ‌రామ్ పేరుతో దాడులు చేస్తే ఎలా..?

    హైద‌రాబాద్ : న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె తాజాగా హిందూ సంస్థ‌ల‌ను టార్గెట్ చేశారు. మ‌రో వివాదానికి తెర తీశారు. ప్ర‌స్తుతం దేశంలో హిందూ సంస్థ‌ల హ‌వా కొన‌సాగుతోంది. ‘జై శ్రీరామ్’ నినాదాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *