శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుప‌తి : తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం, అనుబంధ ఆల‌యాల‌లో జూలై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలను శుక్ర‌వారం వెల్ల‌డించింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టిటీడీ). శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో 03, 10, 17, 24, 31వ‌ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చిపై అమ్మ‌వారు ఆల‌య నాలుగు మాడ వీధులలో విహ‌రించి భక్తులకు ద‌ర్శ‌నం ఇచ్చారు. శ్రీ బలరామ కృష్ణ స్వామి వారి ఆలయంలో…

newsseals-SriPadmavathitemple

తిరుప‌తి : తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం, అనుబంధ ఆల‌యాల‌లో జూలై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలను శుక్ర‌వారం వెల్ల‌డించింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టిటీడీ). శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో 03, 10, 17, 24, 31వ‌ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చిపై అమ్మ‌వారు ఆల‌య నాలుగు మాడ వీధులలో విహ‌రించి భక్తులకు ద‌ర్శ‌నం ఇచ్చారు. శ్రీ బలరామ కృష్ణ స్వామి వారి ఆలయంలో 12న రోహిణి న‌క్ష‌త్రం సంద‌ర్బంగా శ్రీ కృష్ణ స్వామివారికి సాయంత్రం 6 గంట‌లకు తిరుచ్చి ఉత్సవం జ‌రుగ‌నుంది.

శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో జూలై 5 నుండి 7వ తేదీ వ‌ర‌కు శ్రీ సుందరరాజ స్వామివారి అవతారోత్సవాలు నిర్వ‌హిస్తారు. 29న ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంట‌లకు స్వామివారు తిరుచ్చిపై ఆల‌య నాలుగు మాడ వీధులలో విహరించి అనుగ్ర‌హించ‌నున్నారు.
శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో 17న దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం సంద‌ర్భంగా సాయంత్రం 5 గంటలకు స్వామివారు తిరుచ్చిపై భక్తులకు దర్శనం ఇస్తారు. 20న హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు స్వామి వారు తిరుచ్చిపై భక్తులను క‌టాక్షించ‌నున్నారు.

తిరుచానూరు శ్రీనివాస ఆలయంలో ఆగస్టు 4, 11, 18, 25వ‌ తేదీలలో వేంక‌టేశ్వ‌ర స్వామివారి మూలవర్లకు అభిషేకం నిర్వ‌హిస్తారు.అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూలై 7న ఉద‌యం 8 గంట‌ల‌కు అష్టదళ పాదపద్మారాధన సేవ. 8న ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం. 17, 24, 31వ తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రలంకారణ సేవ, అభిషేకం చేప‌డ‌తారు. జూలై 30వ తేదీ పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు. 5, 12, 19, 26వ‌ తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ఉదయం 8.15 గంట‌లకు అభిషేకం జ‌రుగుతుంద‌ని తెలిపింది టీటీడీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports