బడుగులు, మహిళల సంక్షేమానికి పెద్ద పీట

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. SC సంక్షేమానికి రూ.19,100 కోట్లతో 43 లక్షల మంది లబ్దిదారులకు మేలు జ‌రిగింద‌న్నాడు. ST సంక్షేమానికి రూ.5,730 కోట్లతో 9 లక్షల మంది లబ్దిదారులు , BC సంక్షేమానికి రూ.32,534 కోట్ల‌తో 1.18 కోట్ల మంది లబ్దిదారులు, మైనారిటీ సంక్షేమానికి రూ.4,856 కోట్లతో 17 లక్షలకు పైగా లబ్దిదారులకు మేలు జ‌రిగింద‌న్నారు. 5 లక్షల మందికి మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేయడమే లక్ష్యమ‌ని స్ప‌ష్టం చేశారు. మహిళలకు రుణ మద్దతు కింద రూ.2246 కోట్లు ఇచ్చామ‌ని, బ్యాంక్ క్రెడిట్ లింకేజీ కింద రూ.43,219 కోట్లు ద‌క్కాయ‌న్నారు . మూలధన వ్యయాన్ని పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింద‌న్నారు. గత రెండేళ్ల సగటు మూలధన వ్యయం 2019–24 సగటుతో పోలిస్తే 1.5 రెట్లు అధికంగా ఉంద‌న్నారు .

అమరావతి రాజధాని పనులకు 2024–26లో రూ.10,057 కోట్లు కేటాయించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. పోలవరానికి రూ.8,323 కోట్లు, పోర్టులకు రూ.5,437 కోట్లు, జల్ జీవన్ మిషన్‌కు రూ.1,142 కోట్లు, ఎయిర్ పోర్టులకు రూ.2,302 కోట్లు, రహదారులకు రూ.3,439 కోట్లు, రైల్వేల అభివృద్ధి కోసం రూ.64,417 కోట్లు, జాతీయ రహదారుల కోసం రూ.38,800 కోట్లు కేటాయించిన‌ట్లు తెలిపారు. పెద్ద ఎత్తున పీపీపీ ప్రాజెక్టుల అమలుకు నిర్ణయం తీసుకున్నామ‌న్నారు. రూ. 1.78 లక్షల కోట్లతో 390 పీపీపీ ప్రాజెక్టుల అమలుకు ప్రణాళికలు త‌యారు చేశామ‌న్నారు. పీపీపీ ప్రాజెక్టులకు వయబులిటి గ్యాఫ్ ఫండ్ పథకం అమలు చేస్తున్నామ‌న్నారు. కేంద్ర వీజీఎఫ్ స్కీంతో అనుసంధానం చేసిన‌ట్లు వెల్ల‌డించారు. 10 పీపీపీ ప్రాజెక్టులకు రూ. 1850 కోట్ల మేర వీజీఎఫ్ ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపింద‌ని పేర్కొన్నారు.

  • Related Posts

    స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధించ‌గ‌లం

    అమరావతి : స‌వాళ్ల‌ను స్వీక‌రిస్తేనే స‌క్సెస్ సాధ్యం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతున్న తరుణంలో మీరు మీ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కృత్రిమ మేధస్సు ,…

    జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగ‌వంతం చేయండి

    హైద‌రాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సంయుక్త కార్యాచ‌ర‌ణ క‌మిటీ ( హ‌చెజేహెచ్ఎస్ జేఏసీ) . ఇళ్ల స్థ‌లాలు లేక ఎన్నో ఏళ్లుగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *