ప్రజాస్వామ్యానికి భావ ప్రకటన‌ స్వేచ్ఛ అత్యంత కీలకం

హైద‌రాబాద్ : ప్రజాస్వామ్యానికి భావ ప్రకటన‌ స్వేచ్ఛ అత్యంత కీలకం అని స్ప‌ష్టం చేశారు ప్ర‌జా ప్ర‌తినిధులు. తెలంగాణ విద్వేష ప్రసంగాల ప్రత్యేక కమిటీ ఛైర్మన్‌తో అసెంబ్లీ కమిటీ హాల్‌లో కమిటీ రెండవ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, కోవలక్ష్మి, మాణిక్‌రావు, అబ్దుల్ బాలాల్, తిరుపతి శాసనసభ కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి, న్యాయ కార్యదర్శితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యానికి భావప్రకటనా స్వేచ్ఛ అత్యంత కీలకం అని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. అదే సమయంలో, కులం, మతం, ప్రాంతం, భాష వంటి అంశాల ఆధారంగా విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు సామాజిక శాంతి సామరస్యాలకు భంగం కలిగించకుండా చూడటం మన బాధ్యత అని స్ప‌ష్టం చేశారు. విద్వేష పూరిత ప్రసంగాలను అరికట్టడానికి ఉన్న చట్టపరమైన అంశాలు, అమలులో ఎదురయ్యే సమస్యలు, పోలీసు వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై తాము సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. విద్వేషాన్ని ప్రోత్సహించే చర్యలను నివారిస్తూనే, ప్రజల భావప్రకటనా స్వేచ్ఛ హక్కును గౌరవించే సమతుల్య విధానాన్ని రూపొందించడమే మా లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు. చట్టం అందరికీ సమానంగా వర్తించేలా చూడటానికి ఈ కమిటీ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుంది అని చెప్పారు.

  • Related Posts

    కొత్త దరఖాస్తుదారులకు 20లోగా ఆర్థిక సాయం

    అమరావతి : నేతన్నల సేవలో పథకం కింద అర్హులందరికీ ఆర్థిక సాయం అందిస్తామని ప్ర‌క‌టించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. సాంకేతిక కారణాల రీత్యా కొందరికి ఇంకా నగదు జమ కాలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం…

    హల్ద్వానీ ఘటనకు నిరసనగా కాంగ్రెస్ మార్చ్

    హైద‌రాబాద్ : హల్ద్వానీ ఘటనకు నిరసనగా, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకి సంఘీభావంగా జిల్లా స్థాయిలో మార్చ్, సత్యాగ్రహం నిర్వ‌హించాల‌ని టీపీసీసీ నిర్ణ‌యించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ గారు జారీ చేసిన లేఖ ప్రకారం, హల్ద్వానీలో కాంగ్రెస్ పార్టీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *