శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది.
ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేద ఘోష, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జ‌య‌విజ‌యుల‌కు, గ‌రుడాళ్వారుకు, వ‌ర‌ద‌రాజ స్వామివారికి, వ‌కుళమాత అమ్మ‌వారికి, ఆనంద నిల‌యం, యాగ‌శాల, విష్వ‌క్సేనుల వారికి, యోగ న‌ర‌సింహ స్వామి వారికి, భాష్య‌కార్ల‌కు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బ‌లిపీఠం, శ్రీభూవరాహ స్వామి వారికి, శ్రీ బేడి ఆంజనేయ స్వామివారికి పవిత్రమాలలు సమర్పించారు.

అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇచ్చారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వ‌హించారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్వామివారి ఉత్సవ మూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్టమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం. పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారం గానీ లేదా 200 మూరల నూలుదారం గానీ ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దకం చేస్తారు.

  • Related Posts

    100 పుణ్య క్షేత్రాల‌ను క‌లిపేలా ర‌హ‌దారులు

    అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో ఆధ్యాత్మిక ప‌ర్యాట‌క రంగాన్ని బ‌లోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా 100 పుణ్యక్షేత్రాలను అనుసంధానించే రోడ్డు ప్రాజెక్టులను ప్రారంభించింది స‌ర్కార్. రూ. 120 కోట్ల వ్యయంతో 205 కిలోమీటర్ల మేర రోడ్డు…

    వైభవంగా జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ

    దేవుని క‌డ‌ప : దేవుని కడప లోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ మహోత్సవానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఆగమోక్త వైదిక మంత్రోచ్ఛారణల నడుమ వాస్తుశాంతి, మృత్సం గ్రహణం, కుంభారాధన, అంకురార్పణ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *