హైదరాబాద్ : నాటకరంగం, ప్రదర్శన కళలను ప్రోత్సహించడంలో ‘శ్రీరామ నాటక నికేతన్ గత ఆరు దశాబ్దాలుగా సేవలు అందిస్తూ వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని శిల్పకళా వేదికగా కళాకారులు నిర్వహించిన ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. సంగీతం, నృత్యం, నాటకం , సాహిత్యం మన నాగరికతను ఎలా ప్రతిబింబిస్తాయో, మన విలువలను ఎలా కాపాడుతాయో , తరతరాలను ఎలా అనుసంధానిస్తాయో ప్రముఖంగా ప్రస్తావించారు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కిషన్ రెడ్డి. భరతనాట్యం , కూచిపూడి నుండి యక్షగానం, హరికథ , బుర్రకథ వరకు, మన సాంప్రదాయ కళారూపాలు సమాజాన్ని సుసంపన్నం చేస్తూ, మన సాంస్కృతిక వారసత్వాన్ని తరతరాలకు అందిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు.
మన వారసత్వంలో పాతుకుపోయి ఉంటూనే ఆధునికతను స్వీకరించడంలోనే నిజమైన సాంస్కృతిక పునరుజ్జీవనం ఉందని నొక్కి చెప్పారు. . ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుండి భారతీయ సంస్కృతి , వారసత్వానికి గుర్తింపు లభించిందని చెప్పారు. దక్షిణ భారతదేశపు గొప్ప కళా సంప్రదాయాలను ప్రోత్సహించడానికి , పరిరక్షించడానికి,కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా నా పదవీకాలంలో చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలను, అంటే 26 కోట్ల బడ్జెట్తో హైదరాబాద్లో సంగీత నాటక అకాడమీ యొక్క దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రాన్ని స్థాపించడాన్ని గుర్తు చేశారు. గురు-శిష్య సంప్రదాయాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని, భారతీయ కళారూపాలను ప్రోత్సహించేలా పాఠశాలలను ప్రోత్సహించాలని, అలాగే మన సాంస్కృతిక వారసత్వాన్ని పిల్లలకు పరిచయం చేసేలా తల్లిదండ్రులను ప్రేరేపించాలని కోరారు.




