Wednesday, 25 November 2026

దిల్జిత్ దోసాంజ్ సంగీత కచేరీకి బాంబు బెదిరింపు

newsseals-BoombThreat

బెంగ‌ళూరు : ప్ర‌ముఖ పంజాబ్ పాప్ సింగ‌ర్ దిల్జిత్ దోసాంజ్ న‌వంబ‌ర్ 29న బెంగ‌ళూరులో సంగీత క‌చేరి నిర్వ‌హించ‌నున్నారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఉన్న‌ట్టుండి దిల్జిత్ దోసాంజ్ సంగీత కచేరీలో ఐఈడీ పేలుడు జరుపుతామని హెచ్చరిస్తూ ఈమెయిల్ పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఈమెయిల్ ఖాతా ఐపీ అడ్రస్‌ను ట్రేస్ చేస్తున్నారు. ఈ కచేరీ మాదవరలోని నైస్ గ్రౌండ్స్‌లో జరగనుందని పోలీసులు తెలిపారు. 9న హుబ్బళ్లి-ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అధికారిక ఈమెయిల్ ఐడీలకు ఈ బెదిరింపు ఈమెయిల్ పంపబడింది. దోసాంజ్ సంగీత కచేరీ సందర్భంగా ఐఈడీ పేలుడు జరుగుతుందని ఆ ఈమెయిల్‌లో పేర్కొన్నారు.

అంతేకాకుండా, కార్యక్రమానికి పిల్లలను తీసుకు రావద్దని, యజమాని లేని ఐఫోన్‌లను తీయవద్దని, మెట్రో రైలులో ప్రయాణించవద్దని కూడా ప్రజలను హెచ్చరించారు. ఆ సందేశం “ఖలిస్తాన్ జిందాబాద్” అనే పదాలతో ముగిసిందని ఫిర్యాదులో తెలిపారు. తాము బెంగళూరు అంతర్జాతీయ ప్రదర్శన కేంద్రం (BIEC) యాజమాన్యాన్ని సంప్రదించగా, నవంబర్ 29న నైస్ గ్రౌండ్స్‌లో దోసాంజ్ సంగీత కచేరీ జరగాల్సి ఉందని వారు ధృవీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 351(4), నేరపూరిత బెదిరింపు, , 353(1)(బి), ప్రజా అశాంతికి దారితీసే ప్రకటనల కింద నార్త్ సిఇఎన్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

బెదిరింపు సందేశం పంపడానికి ఉపయోగించిన ఈమెయిల్ ఖాతా ఇంట‌ర్న‌ల్ ప్రోటోకాల్ (IP) చిరునామా ,మూలాన్ని గుర్తించడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *