Wednesday, 25 November 2026

రికార్డు ఇన్నింగ్స్‌కు యువరాజ్ సింగ్ కార‌ణం

newsseals-VaibhavSuryavamshi

దోహా : క్రికెట్ లో చిచ్చ‌ర పిడుగుగా పేరు పొందిన వైభ‌వ్ సూర్య‌వంశీ అరుదైన ఘ‌న‌త సాధించాడు.
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో యూఏఈపై రికార్డు సృష్టించే ప్రదర్శన చేయడానికి ముందు, తన ఆరాధ్య దైవమైన యువరాజ్ సింగ్‌తో 30 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడటం, పరధ్యానంలో ఉన్న తన మనసును తిరిగి గాడిలో పెట్టడానికి , సాంకేతిక లోపాలను సరిదిద్దుకోవడానికి సహాయ పడిందని వైభవ్ సూర్యవంశీ చెప్పాడు.15 ఏళ్ల ఈ ఆటగాడు 53 బంతుల్లో 204 పరుగులు చేశాడు. అందులో 28 సిక్సర్లు, ఏడు ఫోర్లు బాది, అత్యంత వేగవంతమైన లిస్ట్-ఎ సెంచరీ , డబుల్ సెంచరీ రికార్డులను తిరగరాశాడు. ఈ వన్డే టోర్నమెంట్‌లో భారత్, యూఏఈని ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.

గత కొన్ని మ్యాచ్‌లలో సాధారణ ప్రదర్శన తన మనసును “మరలించిందని” అయితే యువరాజ్‌తో సంభాషణ తనకు సహాయ పడిందని సూర్యవంశీ అన్నాడు. నేను యువరాజ్ సింగ్ సర్‌తో సుమారు అరగంట పాటు మాట్లాడాను. ఆయన నాకు బ్యాటింగ్ గురించి చాలా విషయాలు వివరించాడు. నాకు కొన్ని విషయాల గురించి ఆందోళనగా ఉండేది, నేను క్రీజులో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆయనతో నిష్కపటంగా మాట్లాడాను అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పంచుకున్న ఒక వీడియోలో సూర్యవంశీ చెప్పాడు.

సుమారు అరగంట పాటు, ఆయన నాకు చాలా విషయాలు వివరించారు. నేను మరో 20 బంతులు ఆడితే స్కోరు చాలా భిన్నంగా ఉంటుందని ఒక్కటే చెప్పారు. ఆయన కొన్ని సాంకేతిక విషయాలను కూడా వివరించారు, అది నాకు సహాయ పడిందన్నాడు. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని, కొన్ని తప్పులను పునరావృతం చేయకుండా తన ఆటను నమ్ము కోవడానికి ఇది వీలు కల్పించిందని సూర్యవంశీ అన్నాడు. వికెట్‌ను విశ్లేషించాలనేదే నా ఆలోచన. నేను రెండు బంతులను నిశితంగా పరిశీలించాను. బంతులు బ్యాట్‌పైకి చక్కగా వస్తుండటంతో, నా ఆటపై నమ్మకం ఉంచానన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *