newsseals.com

ఏపీలో మీడియా స్వేచ్చ‌కు ప్ర‌మాదం

November 26, 2026 · VijayaBhaskar

తిరుప‌తి : మాజీ కేంద్ర మంత్రి చింతా మోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏపీలో పతనమవుతున్న పత్రికా స్వేచ్ఛపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆయా ప‌త్రికాధిప‌తులు, మీడియా అధినేత‌లు జర్నలిస్టుల అధికారాలను హరిస్తున్నారని ఆరోపించారు.
మీడియా అధిపతులు ప్రభుత్వ అధినేతల కాళ్ల దగ్గరికి వెళ్లిపోయారని మండిప‌డ్డారు చింతా మోహ‌న్. ప్రభుత్వం చెప్పిందే రాస్తున్నారు. ప్రతిపక్షాలకు స్థానం ఇవ్వడం లేదన్నారు. ఏపీలో పత్రికా స్వేచ్ఛ అరుంధతీ నక్షత్రంలా మారింద‌న్నారు. తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో, తెలంగాణలో, ఒరిస్సాలో పత్రికా స్వేచ్ఛ వుందని కానీ ఏపీలో మాత్రం ఆకాశంలో దీపంలా మారింద‌న్నారు మాజీ కేంద్ర మంత్రి.

ఏపీలో మీడియా అధిపతులే జర్నలిస్టులు అయ్యారని పేర్కొన్నారు. విలేకరులు పంపే వ్యాసాలు, వార్తలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. పాత్రికేయుల హక్కులు, జీవన స్థితిగతులు ఏపీలో చాలా అధ్వానంగా ఉన్నాయ‌న్నారు. ఏపీలో పాత్రికేయ అసోసియేషన్లు అనేకం ఉన్నాయి. కానీ నామమాత్రంగా పరిమితం అయ్యాయ‌ని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ముఖ్య సూత్రాల్లో పత్రికా స్వేచ్ఛ చాలా పెద్ద అంశం అని గుర్తు చేశారు చింతా మోహ‌న్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పత్రికా స్వేచ్ఛ పూర్తిగా ఉన్నదని, మాకు వ్యతిరేకంగా వార్తలు రాసేవారు. వ్యాసాలు ప్రచురించే వార‌ని అన్నారు. కానీ ఎప్పుడైతే మోదీ , బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ కొలువు తీరిందో దేశంలో మీడియాపై ఆంక్ష‌లు పెరిగాయ‌ని ఆరోపించారు. వేల ఎకరాల భూములు తనకు అనుకూలమైన ధనవంతులకు కట్టబెట్టుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టైటిల్ డీడ్ ప్రభుత్వ చేతుల్లో ఉండాలి. కానీ భూములు పొందిన కంపెనీల చేతుల్లోకి వెళ్ళింద‌న్నారు.

Related News