ప్ర‌ధానిని క‌లిసేందుకు ఢిల్లీ బాట ప‌ట్టిన సీఎం

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన ప్రారంభం కానుంది. దీన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులు మీదుగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని ఆహ్వానించనున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా సీఎం చంద్రబాబు కలవనున్నారు.

అంతే కాకుండా కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సీఆర్ పాటిల్‌ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం 07.30 గంటలకు అమరావతి నుంచి బయలుదేరారు. అక్క‌డి నుంచి 10.00 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులను కలిసిన అనంతరం రేపు ఢిల్లీలోనే ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు బస చేస్తారు. ఢిల్లీలో కార్యక్రమాలను ముగించుకుని గురువారం ఉదయం 10.20 గంటలకు తిరిగి రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు. ఈ విష‌యాన్ని అధికారికంగా తెలిపింది ఏపీ స‌ర్కార్.

  • Related Posts

    ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ ను ఏకి పారేసిన రేణుకా చౌద‌రి

    న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ రాజీనామా చేయాల‌నే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో గ‌త కొన్ని రోజులుగా దేశ రాజ‌ధాని ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆందోళ‌న…

    ప‌వ‌ర్ పోయినా పోరాడ‌టం ఆప‌ను : దీదీ

    కోల్ క‌తా : తాను ఏనాడూ ఎవ‌రికీ త‌ల‌వంచిన దాఖ‌లాలు లేవ‌న్నారు ప‌శ్చిమ బెంగాల్ మాజీ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ. దీదీ నేతృత్వంలో ఈరోజు కోల్‌కతాలో అమరవీరుల దినోత్సవ ర్యాలీని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ప్ర‌జ‌లు, అభిమానులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *