కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి సిద్దం

హైద‌రాబాద్ : కేంద్ర గ‌నుల శాఖ మంత్రి జి. కిష‌న్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న తెలంగాణ ప్ర‌జ‌ల‌కు, కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పారు. తెలంగాణ నుండే కాకుండా దేశంలోని నలుమూలల నుండి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకునే భక్తుల ప్రయాణ ఇబ్బందులు త్వరలో తీరనున్నాయని తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న స్వామి పేరుతో ఏర్పాటు చేసిన రైల్వే స్టేష‌న్ కు సంబంధించి కీల‌క అప్ డేట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను కూడా ఎక్స్ వేదిక‌గా పంచుకున్నారు.

కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న‌కు పెద్ద ఎత్తున భ‌క్తులు ఉన్నారు. ఆయ‌న‌ను కొలిచేందుకు నిత్యం వేలాది మంది త‌ర‌లి వ‌స్తుంటారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను కేంద్ర రైల్వే శాఖ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. స్వామి భక్తుల సౌకర్యార్థం నిర్మించిన కొమరవెల్లి రైల్వే స్టేషన్ జూలై 26న ప్రారంభం కానుందని ప్ర‌క‌టించారు కేంద్ర మంత్రి. ఆధునిక వసతులతో రూ. 5.33 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ స్టేషన్, అందుబాటులోకి వచ్చిన తర్వాత భక్తుల ప్రయాణాన్ని సులభతరం చేస్తుంద‌న్నారు.

  • Related Posts

    ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ ను ఏకి పారేసిన రేణుకా చౌద‌రి

    న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ రాజీనామా చేయాల‌నే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో గ‌త కొన్ని రోజులుగా దేశ రాజ‌ధాని ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆందోళ‌న…

    ప్ర‌ధానిని క‌లిసేందుకు ఢిల్లీ బాట ప‌ట్టిన సీఎం

    అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన ప్రారంభం కానుంది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *