Thursday, 12 November 2026

ఏపీలో త్వరలో ‘పెట్టుబడిదారుల రక్షణ చట్టం’

newsseals-NaraLokesh

అమ‌రావ‌తి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో త్వ‌ర‌లో ‘పెట్టుబడిదారుల రక్షణ చట్టం’ తీసుకు రానున్నట్లు ప్రకటించారు. గురువారం 31వ సీఐఐ (CII) పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ 2026 ప్రారంభోత్సవంలో పాల్గొని ప్ర‌సంగించారు. రాష్ట్రంలో చేసే పెట్టుబడులకు భద్రత కల్పించేందుకు ఈ చట్టం దోహద పడుతుందని పేర్కొన్నారు. ఎస్క్రో ఖాతాల విధానాన్ని ముందుగా అమలు చేసిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ‘పెట్టుబడిదారుల రక్షణ చట్టాన్ని’ అమలు చేయనున్న మొదటి రాష్ట్రంగా నిలవనుందని అన్నారు. పెట్టుబడిదారులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఈ చట్టంపై చురుగ్గా పని చేస్తోందని లోకేష్ చెప్పారు. ఇటువంటి చట్టం పారిశ్రామికవేత్తలకు మరింత నమ్మకాన్ని, భరోసానిస్తుంది .. పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తుంది అని ఆయన అన్నారు. ఈ విధానానికి జాతీయ స్థాయిలో ఆమోదం లభించేలా, అమలుకు సహకరించాలని కేంద్ర వాణిజ్య , పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను ఆయన కోరారు.

పెట్టుబడిదారుల కోసం ఎస్క్రో ఖాతాల వంటి వినూత్న విధానాలను ప్రవేశ పెట్టిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడుల రక్షణ కోసం ప్రత్యేక చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురాబోతున్న మొదటి రాష్ట్రంగా అవతరించనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి లోకేష్ ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించడమే కాకుండా ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని, ఆవిష్కరణలు చేయాలని వృద్ధి చెందాలని కోరారు. కేవలం కర్మాగారాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌నే తమ కార్పొరేట్ కేంద్రంగా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం, మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. మాకు 1,000 కిలోమీటర్లకు పైగా తీరప్రాంతం ఉంది. మా ప్రధాన ఓడరేవు అయిన విశాఖపట్నంతో పాటు ఇతర ఓడరేవుల ద్వారా ప్రస్తుతం ఏటా సుమారు 10 కోట్ల టన్నుల సరుకు రవాణా జరుగుతోంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *