Wednesday, 25 November 2026

ఏపీలో కొన‌సాగుతున్న రాచ‌రిక పాల‌న

newsseals-PerniNani

అమ‌రావ‌తి : మా జీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు ఏపీ కూట‌మి ప్ర‌భుత్వంపై. రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న‌కు బ‌దులు రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ఆరోపించారు. ఇదిలా ఉండ‌గా కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గ సౌత్ మండలంలో కూటమికి భారీ షాక్ తగిలింది. కృష్ణాజిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మాజీమంత్రి పేర్ని నాని సమక్షంలో టిడిపి నుంచి వైసీపీలోకి భారీగా చేరారు. కేపీటి పాలెం కుచెందిన ఓడుగు నాగరాజు ఆధ్వర్యంలో 100 మందికి పైగా వైసీపీ లో చేరారు. పార్టీ లో చేరిన టీడీపీ నాయకులు కార్యకర్తలకు వైస్సార్సీపీ పార్టీ కండువాలు కప్పి సాధారం గా ఆహ్వానం పలికారు పేర్ని నాని. ఈ సంద‌ర్బంగా మాజీ మంత్రి ప్ర‌సంగించారు.

రాష్టం లో కూటమి ప్ర‌భుత్వం రాక్షస పాలన సాగిస్తోందంటూ నిప్పులు చెరిగారు. ప్రజలను ఓటు బ్యాంకుగా తప్ప మనుషులుగా చూడడం మానేసిందన్నారు. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రజలను పట్టి పీడిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అధికారం కోసం మనుషులను వాడుకుని అధికారం పొందిన తర్వాత విస్మరించడం కూటమి నైజం అన్నారు పేర్ని నాని. కూటమి ప్రభుత్వ విధానాలపై విసుకు చెందిన కేపీటీ పాలెం ప్రజలు వైసిపి పార్టీలో చేరడం జరిగిందన్నారు. వైసీపీలో చేరిన వారికి పార్టీ అండదండగా నిలుస్తుందని భ‌రోసా ఇచ్చారు. గత వైయస్సార్ ప్రభుత్వం హయాంలో కే పి టి పాలెం పంచాయితీ పరిధిలో జరిగిన అభివృద్ధిపై ప్రజలకు పార్టీ శ్రేణులు తెలియ పరచాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *